Header Banner

పాకిస్తాన్ కు చావుదెబ్బ.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. గుజరాత్‌ సీఎంకు మోదీ ఫోన్‌!

  Fri May 09, 2025 14:54        Politics

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమీక్షించారు. పాకిస్థాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్‌తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్‌లో భద్రతా ఏర్పాట్లపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భద్రతాపరంగా అత్యంత సున్నితమైనవిగా పరిగణించే కచ్, బనస్కంతా, పటాన్, జామ్‌నగర్ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని, పౌరుల భద్రత నిమిత్తం రాష్ట్ర యంత్రాంగం చేపడుతున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. పాకిస్థాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగ్గా ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల మంత్రులు కూడా తమ తమ శాఖల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, ఆర్థికపరమైన సన్నద్ధత, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవల లభ్యత వంటి పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu